Saturday, 11 April 2026
  • Home  
  • దేశ ప్రజలకు ఫూలే బాట ఆచరణనీయం ఎర్రవల్లిలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు.
- జోగులాంబ గద్వాల

దేశ ప్రజలకు ఫూలే బాట ఆచరణనీయం ఎర్రవల్లిలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు.

*దేశ ప్రజలకు ఫూలే బాట ఆచరణనీయం.* *ఎర్రవల్లిలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు.* *నివాళి అర్పించిన బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మణి కుమార్* జోగులాంబ గద్వాల్ ఏప్రిల్ 11 (పున్నమి ప్రతినిధి) దేశ ప్రజలకు పూలే బాట ఆచరణనీయమనీ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ అన్నారు. దేశంలోని ప్రజలకు విద్య రావాలనే ఉద్దేశంతో విద్యా విప్లవానికి కృషి చేశారని ఈ సందర్భంగా ఫూలే సేవలను ఆయన కొనియాడారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలను ఎర్రవల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12 సంవత్సరాల వయసులోనే దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య రావాలనే సంకల్పంతో చిన్నతనంలోనే సావిత్రిబాయి పూలేను బాల్య వివాహం చేసుకొని.. ఆమెకు విద్యను నేర్పించి అనంతరం దేశ ప్రజలకు విద్యను నేర్పాలని ఆమెను మహిళ ఉపాధ్యాయులుగా తయారు చేయడం జరిగిందన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీ వర్గాలకు విద్య ఉండాలనే ప్రతిపాదనలను అప్పటి విద్యా కమీటి హంటర్ కమిషన్ వినతి పత్రాన్ని అందజేశారని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యకు అధిక ప్రాముఖ్యత నివ్వాలన్నారు. విద్య మరియు ఓటు హక్కు ద్వారానే మార్పు సాధ్యమని ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు, అలంపూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శాంతి రాజు, ఎర్రవల్లి మండల అధ్యక్షులు ధర్మవరం రాముడు, ఇటిక్యాల మండల అధ్యక్షుడు టి.జీవన్ , వార్డ్ సభ్యులు హైమావతి, మహేశ్వరి, శిరోమణి, రామచంద్రుడు, సీనియర్ నాయకులు బొజ్జన్న, బీసన్న, దుబ్బన్న ఇతరులు పాల్గొన్నారు.

*దేశ ప్రజలకు ఫూలే బాట ఆచరణనీయం.*

*ఎర్రవల్లిలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు.*

*నివాళి అర్పించిన బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మణి కుమార్*

జోగులాంబ గద్వాల్ ఏప్రిల్ 11 (పున్నమి ప్రతినిధి) దేశ ప్రజలకు పూలే బాట ఆచరణనీయమనీ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ అన్నారు. దేశంలోని ప్రజలకు విద్య రావాలనే ఉద్దేశంతో విద్యా విప్లవానికి కృషి చేశారని ఈ సందర్భంగా ఫూలే సేవలను ఆయన కొనియాడారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలను ఎర్రవల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12 సంవత్సరాల వయసులోనే దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య రావాలనే సంకల్పంతో చిన్నతనంలోనే సావిత్రిబాయి పూలేను బాల్య వివాహం చేసుకొని.. ఆమెకు విద్యను నేర్పించి అనంతరం దేశ ప్రజలకు విద్యను నేర్పాలని ఆమెను మహిళ ఉపాధ్యాయులుగా తయారు చేయడం జరిగిందన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీ వర్గాలకు విద్య ఉండాలనే ప్రతిపాదనలను అప్పటి విద్యా కమీటి హంటర్ కమిషన్ వినతి పత్రాన్ని అందజేశారని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యకు అధిక ప్రాముఖ్యత నివ్వాలన్నారు. విద్య మరియు ఓటు హక్కు ద్వారానే మార్పు సాధ్యమని ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు, అలంపూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శాంతి రాజు, ఎర్రవల్లి మండల అధ్యక్షులు ధర్మవరం రాముడు, ఇటిక్యాల మండల అధ్యక్షుడు టి.జీవన్ , వార్డ్ సభ్యులు హైమావతి, మహేశ్వరి, శిరోమణి, రామచంద్రుడు, సీనియర్ నాయకులు బొజ్జన్న, బీసన్న, దుబ్బన్న ఇతరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.