ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిసి వందేమాతర గేయాన్ని ఆలపించి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ కే. కోటేశ్వరరావు కిరణమై, కృపా కరుణ వాణి, డాక్టర్ బి. పీర్ కుమార్ తదితరులు మాట్లాడుతూ 2025తో వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి అని, మన జాతీయ గేయం ‘వందే మాతరా’న్ని 1875 నవంబరు 7న అక్షయ నవమి శుభ వేళ బంకించంద్ర ఛటర్జీ రచించారని, ఆయన నవల ఆనందమఠ్ లో భాగంగా బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో వందే మాతరం మొదటిసారి కనిపించిందని, బలానికి, శ్రేయస్సుకు, దైవత్వానికి స్వరూపంగా మాతృభూమిని కీర్తించే ఈ గేయం దేశ ఐక్యత, ఆత్మగౌరవ స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణ అని, ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, గోపాల్, రమేష్, శైలజ, శ్రీలత, పద్మమ్మ, వినయ్ తదితర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

దేశభక్తికి శాశ్వత చిహ్నం- వందే మాతరం – వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు
ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిసి వందేమాతర గేయాన్ని ఆలపించి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ కే. కోటేశ్వరరావు కిరణమై, కృపా కరుణ వాణి, డాక్టర్ బి. పీర్ కుమార్ తదితరులు మాట్లాడుతూ 2025తో వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి అని, మన జాతీయ గేయం ‘వందే మాతరా’న్ని 1875 నవంబరు 7న అక్షయ నవమి శుభ వేళ బంకించంద్ర ఛటర్జీ రచించారని, ఆయన నవల ఆనందమఠ్ లో భాగంగా బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో వందే మాతరం మొదటిసారి కనిపించిందని, బలానికి, శ్రేయస్సుకు, దైవత్వానికి స్వరూపంగా మాతృభూమిని కీర్తించే ఈ గేయం దేశ ఐక్యత, ఆత్మగౌరవ స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణ అని, ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, గోపాల్, రమేష్, శైలజ, శ్రీలత, పద్మమ్మ, వినయ్ తదితర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

