Thursday, 5 February 2026
  • Home  
  • దేవినేని ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య
- ఎన్ టి ఆర్ జిల్లా

దేవినేని ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య

ఏపీ ప్రభుత్వ విప్‌, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గురువారం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య తో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం వంటి అంశాలపై స్వల్పంగా చర్చ జరిగింది. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలను చేపట్టాలని, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

ఏపీ ప్రభుత్వ విప్‌, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గురువారం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య తో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ భేటీలో పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం వంటి అంశాలపై స్వల్పంగా చర్చ జరిగింది. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలను చేపట్టాలని, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.