Friday, 6 February 2026
  • Home  
  • దేవరకొండ డివిజన్లో భారీ వర్షాలతో ప్రజల ఇక్కట్లు !
- తెలంగాణ

దేవరకొండ డివిజన్లో భారీ వర్షాలతో ప్రజల ఇక్కట్లు !

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) దేవరకొండ డివిజన్లో భారీ వర్షాలు ఎక్కువగా ఉండడం, డివిజన్ మొత్తంలో 12 సెంటీమీటర్ల వర్షం కురవడం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ డివిజన్ లో పర్యటించారు. కొండమల్లేపల్లి మండలం గిరిజనగర్ తండా వద్ద పై నుండి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తూ ప్రధాన రహదారిపై నిలిచిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గమనించి తక్షణమే వర్షపు నీటిని మళ్లించి, ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాజ్ వేలు, రహదారుల బ్రిడ్జ్ లపై ప్రయాణించవద్దని సూచించారు. అలాగే వర్షం వల్ల తడిసి పడిపోయేందుకు అవకాశం ఉన్న ఇళ్లలో ఉండవద్దని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటా దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి,తాహసిల్దార్, ఎంపీడీవో,తదితరులు ఉన్నారు.

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
దేవరకొండ డివిజన్లో భారీ వర్షాలు ఎక్కువగా ఉండడం, డివిజన్ మొత్తంలో 12 సెంటీమీటర్ల వర్షం కురవడం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ డివిజన్ లో పర్యటించారు. కొండమల్లేపల్లి మండలం గిరిజనగర్ తండా వద్ద పై నుండి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తూ ప్రధాన రహదారిపై నిలిచిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గమనించి తక్షణమే వర్షపు నీటిని మళ్లించి, ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాజ్ వేలు, రహదారుల బ్రిడ్జ్ లపై ప్రయాణించవద్దని సూచించారు. అలాగే వర్షం వల్ల తడిసి పడిపోయేందుకు అవకాశం ఉన్న ఇళ్లలో ఉండవద్దని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటా దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి,తాహసిల్దార్, ఎంపీడీవో,తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.