*వర్షాలు అధికంగా కురుస్తున్న నేపద్యంలో దేవరకద్ర నియోజకవర్గంకు చెందిన అధికారులను ప్రజాప్రతినిధుల ను అప్రమత్తం చేశారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం ద్వారా 5 గేట్లను ఎత్తి దిగువ కు నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలకు ఊకచెట్టు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది కనుక ఊకచెట్టు వాగు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
సరళసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి స్వైపన్స్ తెరుచుకున్నాయి. కొత్తకోట నుండి ఆత్మకూరు వెళ్లే దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి అటువైపు ఎవ్వరు వెళ్లకుండా చూసుకోవాలి. ఎక్కడైనా వర్షాల వల్ల ఇళ్ళు కూలిపోతే ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు కోరారు….
కాన్ఫరెన్స్ కాల్ లో ఎమ్మార్వో లు , ఎంపీడీఓలు , పోలీస్ అధికారులు , నియోజకవర్గంకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు….