
విశాఖపట్నం: శనివారం పంజాబ్ హోటల్ జంక్షన్‌లో శ్రీ లక్ష్మీ గణపతి దుర్గ ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గాదేవి నవరాత్రి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మరియు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు.
కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి దుర్గ ఆటో స్టాండ్ కమిటీ సభ్యులు, ఆటో డ్రైవర్లు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

