పున్నమి వార్త
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, 24.09.2025.
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే వసంతకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ మర్యాదలతో ఆయన్ని సాదరంగా స్వాగతించారు. వేదపండితులు ఆశీర్వదించి, అమ్మవారి చిత్రపటం, తీర్ధప్రసాదాలు అందజేశారు.


