Story highlights
- నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు.
- ఈ సమావేశానికి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా మండలంలోని పార్టీ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులతో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక ఎన్నికలు, అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పార్టీ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులతో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక ఎన్నికలు, అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.