నందిగామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దీపావళి పండుగ ను పురస్కరించుకుని, నందిగామ సమీపంలోని గుర్రాలపేట వద్ద నివాసముండే బుడగ జంగాల నిరుపేద కుటుంబాలకు సహాయంగా బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్వర్గీయ పోలిశెట్టి సుధాకర్ ను స్మరించుకుంటూ, ఆయన సతీమణి పద్మావతి, కుమారు లు పోలిశెట్టి వెంకటరావు, ఉపేంద్ర, సురేష్ కలిసి సహకారం అందించారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు పారేపల్లి సాయిబాబు సమన్వ యంతో, ఎస్సై అభిమన్యు చేతుల మీదుగా 25 నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ 10 కేజీల చొప్పున సాంబమసూరి బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై అభిమన్యు మాట్లాడుతూ, “నిరుపేదలు అయినా చదువు ద్వారా ఎదగవచ్చని, తల్లిదండ్రు లు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని, చదువుతో మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, ఉద్యోగా లలో స్థిరపడతారని” తెలిపారు.
ఆర్యవైశ్య సంఘ నాయకులు పారేపల్లి సాయిబాబు మాట్లాడు తూ, “ఇప్పటికే దసరా, దీపావళి సందర్భంగా మేము సుమారు 310 మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేశాం. ఇది సమాజం పట్ల మేము చేస్తున్న చిన్న సహకారం” అనితెలిపారు.
ఈ కార్యక్రమంలో పబ్బతి జనార్ధనరావు, అమ్రాన్ బ్యాటరీ డిస్ట్రిబ్యూటర్ పూర్ణతదితరులు పాల్గొన్నారు.

దీపావళి సందర్భంగా నిరుపేదలకు బియ్యం పంపిణీ
నందిగామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దీపావళి పండుగ ను పురస్కరించుకుని, నందిగామ సమీపంలోని గుర్రాలపేట వద్ద నివాసముండే బుడగ జంగాల నిరుపేద కుటుంబాలకు సహాయంగా బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్వర్గీయ పోలిశెట్టి సుధాకర్ ను స్మరించుకుంటూ, ఆయన సతీమణి పద్మావతి, కుమారు లు పోలిశెట్టి వెంకటరావు, ఉపేంద్ర, సురేష్ కలిసి సహకారం అందించారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు పారేపల్లి సాయిబాబు సమన్వ యంతో, ఎస్సై అభిమన్యు చేతుల మీదుగా 25 నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ 10 కేజీల చొప్పున సాంబమసూరి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై అభిమన్యు మాట్లాడుతూ, “నిరుపేదలు అయినా చదువు ద్వారా ఎదగవచ్చని, తల్లిదండ్రు లు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని, చదువుతో మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, ఉద్యోగా లలో స్థిరపడతారని” తెలిపారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు పారేపల్లి సాయిబాబు మాట్లాడు తూ, “ఇప్పటికే దసరా, దీపావళి సందర్భంగా మేము సుమారు 310 మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేశాం. ఇది సమాజం పట్ల మేము చేస్తున్న చిన్న సహకారం” అనితెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్బతి జనార్ధనరావు, అమ్రాన్ బ్యాటరీ డిస్ట్రిబ్యూటర్ పూర్ణతదితరులు పాల్గొన్నారు.

