పున్నమి ప్రతి నిధి
దీపాల పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం ప్రతి ఇంటా వెలుగులు, ఆనందం నింపాలని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి విజయం సాధించిన దీపావళి ఆత్మను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధి, ఐక్యత దిశగా ముందుకు సాగాలని కోరారు.


