పున్నమి ప్రతినిధి
ఖమ్మం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో ఆనందం, సుఖశాంతులు నిండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అఖండ భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే దీపావళి పర్వదినం అందరికీ సుభిక్షం, ఐక్యతను అందించాలని కోరుతూ, సామాజిక సౌభ్రాతృత్వం బలపడేలా ప్రతి ఒక్కరూ పండుగను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


