పున్నమి ప్రతినిధి
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ నాయకుడు తాండ్ర వినోద్ రావు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందం, సంతోషం నింపాలని, చీకటిని తొలగించి వెలుగుని ప్రసరించే దీపాల వలె ప్రజల జీవితాల్లో సుభిక్షం నిండాలని ఆకాంక్షించారు. అలాగే ఆయన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO) పోతుల చంద్రశేఖర్ కూడా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ఐక్యత, సానుకూలత, సద్భావనకు ప్రతీకగా నిలవాలని వారు కోరుకున్నారు.


