Thursday, 5 February 2026
  • Home  
  • దీపావళి బాణసంచా విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – నగర పోలీసు కమిషనర్ హెచ్చరిక
- విశాఖపట్నం

దీపావళి బాణసంచా విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – నగర పోలీసు కమిషనర్ హెచ్చరిక

పత్రికా ప్రకటన విశాఖపట్నం సిటీ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) దీపావళి బాణసంచా విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – నగర పోలీసు కమిషనర్ హెచ్చరిక దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20, 2025న నగరవ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, నిల్వలు, దుకాణాల ఏర్పాటు విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే ప్రత్యేక బృందాలు ముమ్మర తనిఖీలు ప్రారంభించాయని తెలిపారు. — లైసెన్స్ పొందే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు బాణసంచా అమ్మకందారులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు క్రింది భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలి — 1️⃣ పటాకుల దుకాణాల మధ్య కనీసం 15 మీటర్ల భద్రతా దూరం ఉండాలి. 2️⃣ షెడ్ లొకేషన్ మ్యాప్, ప్లాన్‌లు విద్యుత్, అగ్నిమాపక, జీవీఎంసీ అధికారుల అనుమతితో ఉండాలి. 3️⃣ ఎలక్ట్రికల్, ఫైర్, జివిఎంసీ శాఖల NOC తప్పనిసరి. 4️⃣ దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడినవారై ఉండాలి. 5️⃣ వాణిజ్య పన్ను శాఖ (GST) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సమర్పించాలి. 6️⃣ షెడ్‌లో ఆయిల్ ల్యాంపులు, గ్యాస్ లైట్లు, నేకెడ్ లైట్లు వాడరాదు. 7️⃣ ప్రతి లైసెన్సు దుకాణం ఎప్పుడైనా తనిఖీకి సిద్ధంగా ఉండాలి. 8️⃣ దుకాణాలు ఆసుపత్రులు, పాఠశాలలు, దేవాలయాలు మొదలైన వాటి నుండి కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి. 9️⃣ తగినంత ఇసుక బకెట్లు, నీరు అందుబాటులో ఉండాలి. 🔟 గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కొనుగోలు, అమ్మకాలు జరగాలి. 11️⃣ దీపావళి రోజున రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు మాత్రమే పటాకులు పేల్చేందుకు అనుమతి. 12️⃣ హ్యాండ్ శానిటైజర్ వాడరాదు – సాధారణ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. — దుకాణాలలో పాటించాల్సిన సూచనలు లైసెన్స్ పరిధిలోనే విక్రయం జరగాలి. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే దుకాణాలు ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇసుక సంచులు తప్పనిసరి. 18 ఏళ్ల లోపు పిల్లలకు బాణసంచా అమ్మకూడదు. షెడ్లు మూడు మీటర్ల దూరంలో ఉండాలి. దుకాణంలో లైసెన్స్ పరిమితిని మించని టపాసులు మాత్రమే ఉంచాలి. అనధికార వ్యక్తులను ప్రవేశించనీయకూడదు. తగినంత గాలి ప్రసరణ, ఎమర్జెన్సీ నిష్క్రమణ మార్గాలు ఉండాలి. — బహిరంగ బాణసంచా ప్రదర్శనలో పాటించాల్సిన సూచనలు 1️⃣ ప్రదర్శనకు కనీసం 7 రోజుల ముందుగానే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలి. 2️⃣ ఆసుపత్రులు, పాఠశాలల నుండి 250 మీటర్ల లోపు ప్రదర్శన నిషేధం. 3️⃣ అగ్నిమాపక సిబ్బంది, పరికరాలు సిద్ధంగా ఉంచాలి. 4️⃣ ప్రేక్షకులకు కనీసం 100 మీటర్ల భద్రతా దూరం ఉండాలి. 5️⃣ లైసెన్సు పొందిన అధీకృత బాణసంచా మాత్రమే ఉపయోగించాలి. — ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి నగరవాసులు తమ పరిసరాల్లో అనధికార బాణసంచా నిల్వ లేదా విక్రయాలు జరుగుతున్నాయని అనుమానం ఉంటే వెంటనే డయల్ 100 / 112 నంబర్‌కి గానీ, లేదా సీపీ గారి నంబర్ 7995095799కి సమాచారం ఇవ్వాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, చట్టవ్యతిరేకంగా బాణసంచా నిల్వ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పత్రికా ప్రకటన
విశాఖపట్నం సిటీ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

దీపావళి బాణసంచా విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – నగర పోలీసు కమిషనర్ హెచ్చరిక

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20, 2025న నగరవ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, నిల్వలు, దుకాణాల ఏర్పాటు విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు.
నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే ప్రత్యేక బృందాలు ముమ్మర తనిఖీలు ప్రారంభించాయని తెలిపారు.

లైసెన్స్ పొందే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు

బాణసంచా అమ్మకందారులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు క్రింది భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలి —

1️⃣ పటాకుల దుకాణాల మధ్య కనీసం 15 మీటర్ల భద్రతా దూరం ఉండాలి.
2️⃣ షెడ్ లొకేషన్ మ్యాప్, ప్లాన్‌లు విద్యుత్, అగ్నిమాపక, జీవీఎంసీ అధికారుల అనుమతితో ఉండాలి.
3️⃣ ఎలక్ట్రికల్, ఫైర్, జివిఎంసీ శాఖల NOC తప్పనిసరి.
4️⃣ దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడినవారై ఉండాలి.
5️⃣ వాణిజ్య పన్ను శాఖ (GST) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సమర్పించాలి.
6️⃣ షెడ్‌లో ఆయిల్ ల్యాంపులు, గ్యాస్ లైట్లు, నేకెడ్ లైట్లు వాడరాదు.
7️⃣ ప్రతి లైసెన్సు దుకాణం ఎప్పుడైనా తనిఖీకి సిద్ధంగా ఉండాలి.
8️⃣ దుకాణాలు ఆసుపత్రులు, పాఠశాలలు, దేవాలయాలు మొదలైన వాటి నుండి కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి.
9️⃣ తగినంత ఇసుక బకెట్లు, నీరు అందుబాటులో ఉండాలి.
🔟 గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కొనుగోలు, అమ్మకాలు జరగాలి.
11️⃣ దీపావళి రోజున రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు మాత్రమే పటాకులు పేల్చేందుకు అనుమతి.
12️⃣ హ్యాండ్ శానిటైజర్ వాడరాదు – సాధారణ సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

దుకాణాలలో పాటించాల్సిన సూచనలు

లైసెన్స్ పరిధిలోనే విక్రయం జరగాలి.

గ్రౌండ్ ఫ్లోర్‌లోనే దుకాణాలు ఉండాలి.

ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇసుక సంచులు తప్పనిసరి.

18 ఏళ్ల లోపు పిల్లలకు బాణసంచా అమ్మకూడదు.

షెడ్లు మూడు మీటర్ల దూరంలో ఉండాలి.

దుకాణంలో లైసెన్స్ పరిమితిని మించని టపాసులు మాత్రమే ఉంచాలి.

అనధికార వ్యక్తులను ప్రవేశించనీయకూడదు.

తగినంత గాలి ప్రసరణ, ఎమర్జెన్సీ నిష్క్రమణ మార్గాలు ఉండాలి.

బహిరంగ బాణసంచా ప్రదర్శనలో పాటించాల్సిన సూచనలు

1️⃣ ప్రదర్శనకు కనీసం 7 రోజుల ముందుగానే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలి.
2️⃣ ఆసుపత్రులు, పాఠశాలల నుండి 250 మీటర్ల లోపు ప్రదర్శన నిషేధం.
3️⃣ అగ్నిమాపక సిబ్బంది, పరికరాలు సిద్ధంగా ఉంచాలి.
4️⃣ ప్రేక్షకులకు కనీసం 100 మీటర్ల భద్రతా దూరం ఉండాలి.
5️⃣ లైసెన్సు పొందిన అధీకృత బాణసంచా మాత్రమే ఉపయోగించాలి.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

నగరవాసులు తమ పరిసరాల్లో అనధికార బాణసంచా నిల్వ లేదా విక్రయాలు జరుగుతున్నాయని అనుమానం ఉంటే వెంటనే డయల్ 100 / 112 నంబర్‌కి గానీ, లేదా సీపీ గారి నంబర్ 7995095799కి సమాచారం ఇవ్వాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, చట్టవ్యతిరేకంగా బాణసంచా నిల్వ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.