సంక్షేమ పథకాలు, ధరల తగ్గింపుతో ప్రజల్లో సంతోషం
రైల్వే కోడూరు (అన్నమయ్య జిల్లా), అక్టోబర్ 20 (పున్నమి న్యూస్):
రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంతగాని నరసింహ ప్రసాద్ రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాలలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు నింపి, ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పంతగాని నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు జీఎస్టీ తగ్గుదల కారణంగా సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరికీ అన్నింటిపై ధరలు తగ్గి, ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రస్తుత సానుకూల వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఈ దీపావళిని వెలుగులమయం చేసుకుని, తమ జీవితాల్లో నూతన కాంతులను నింపుకోవాలని ఆయన కోరారు.


