🎇 అనుమతి లేకుండా బాణాసంచా అమ్మకం, నిల్వ, తయారీ లేదా రవాణా చేయడం పూర్తిగా నిషేధం.
ప్రతి సంవత్సరం కొంతమంది వ్యక్తులు అనుమతి లేకుండా బాణాసంచా స్టాళ్లు పెట్టడం, ఇళ్లలో నిల్వ చేయడం లేదా చిన్నపిల్లలను కూడా ఇలాంటి పనులకు ఉపయోగించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారు చట్టపరమైన కఠిన చర్యలకు గురవుతారని గట్టిగా హెచ్చరించబడుచున్నది.
ఇప్పటికే పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పొర్లుపాలెం గ్రామం వద్ద కొండవలస రవికుమార్ అనే వ్యక్తి బాణాసంచా అక్రమంగా తయారు చేస్తున్నప్పుడు పట్టుబడగా, పెద్ద మొత్తంలో బాణాసంచా మరియు తయారీకి ఉపయోగించే పదార్థాలు స్వాధీనం చేయబడ్డాయి. అతనిపై Explosive Substances Act ప్రకారం కేసు నమోదు చేసి, కోర్టులో హాజరపరచగా రిమాండ్‌కు పంపించబడినాడు.
🔸 బాణాసంచా అమ్మకానికి స్టాల్ ఏర్పాటు చేయదలచిన వారు తప్పనిసరిగా ప్రత్యేక పర్మిషన్ తీసుకోవాలి.
ఒక పర్మిషన్ మీద బహుళ స్టాళ్లు ఏర్పాటు చేస్తే, అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోబడతాయి.
🔸 పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, పార్కింగ్ సౌకర్యం ఉన్న సురక్షిత ప్రదేశాలను మాత్రమే ఎంచుకోవాలి.
పార్కింగ్ లేకుండా ఉన్న ప్రదేశాలకు అనుమతి ఇవ్వబడదు.
🔸 దీపావళి సందర్భంగా పెందుర్తి పోలీస్ పరిధిలో నిఘా బలపరచబడింది.
ఎవరైనా అనుమతి లేకుండా బాణాసంచా విక్రయాలు, నిల్వలు లేదా రవాణా నిర్వహించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవు.
ఎక్కడైనా అక్రమ బాణాసంచా తయారీ లేదా అమ్మకాలు గమనించినట్లయితే వెంటనే 112 లేదా పెందుర్తి పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 96767 97314, పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ 94407 96039 కు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.


