దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా ప్రేలుళ్ళు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు
చేపట్టాలని జిల్లా అంతట దీపావళి మందు గుండు సామాగ్రి స్టోరేజ్ గోడౌన్లు మరియు అమ్మకాలు జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పోలీస్ వారు.
ఆకస్మిక తనిఖీలు చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారము భద్రత చర్యలు తీసుకుంటున్నారా? లేదా అని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దీపావళి మందుగుండు సామగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను నిర్దేశించిందని, దానికి అనుగుణంగా మందుగుండు సామగ్రి తయారీ, నిల్వ గోడౌన్లు, దుకాణ దారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా రహస్యముగా మందు గుండు సామాగ్రి తయారు చేస్తున్నట్లు గాని, నిల్వ ఉంచినట్లు గాని తెలిసిన యెడల, డయల్ 112 కాల్ ద్వారా జిల్లా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


