నెల్లూరు నగరంలో దివ్యాంగులకు శుభవార్త అందింది. జిల్లా ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారికి అందుతున్న సదుపాయాలను పరిశీలించారు.
ఈ పథకం ద్వారా ఇకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని దివ్యాంగులను కోరారు. ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ సుజాత, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగుల జీవనోపాధి, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఈ పథకం ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.



