Thursday, 5 February 2026
  • Home  
  • దాత ఆశయానికి తూట్లు… వెయ్యి కోట్లు విలువైన ఆనంద నిలయం భూమిపై అక్రమార్కుల పాగా… అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కొండబాబు ఘాటైన ఆరోపణలు… త్వరలోనే ఆనందనిలయం ఆస్తుల పరి రక్షణ కు ప్రజా ఉద్యమానికి సన్నాహాలు..
- ఆంధ్రప్రదేశ్

దాత ఆశయానికి తూట్లు… వెయ్యి కోట్లు విలువైన ఆనంద నిలయం భూమిపై అక్రమార్కుల పాగా… అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కొండబాబు ఘాటైన ఆరోపణలు… త్వరలోనే ఆనందనిలయం ఆస్తుల పరి రక్షణ కు ప్రజా ఉద్యమానికి సన్నాహాలు..

కాకినాడ, కాకినాడ జిల్లా, పున్నమి ప్రతినిధి: పిఠాపురం మహారాజా చిన్నారుల విద్య–వికాసం కోసం అప్పగించిన దాతాస్పద ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘాటుగా హెచ్చరించారు. ఆనంద నిలయం పరిధిలోని 19 ఎకరాల భూమిని ఆక్రమించేందుకుచోటుచేసుకుంటున్న కుట్రలు దాత ఆశయానికే తూట్లు పొడుస్తున్నాయని ఆయన తీవ్రఆగ్రహంవ్యక్తంచేశారు.ఆదివారం ఆనందనిలయం ప్రాంగాణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు వెయ్యి కోట్లు విలువ చేసే ఈ భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డి దోవలో పాగా వేయడానికి పన్నాగం పన్నెరని తెలిపారు. వారి ఆటలు ఇక సాగవని.ఎవరు కొనడానికి ముందుకొస్తే వారు ఇబ్బందుల్లో పడతారని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే చిన్నారుల గూడు అయిన ఆనంద నిలయాన్ని కాకావికాలం చేసిందని ఆయన మండిపడ్డారు.1910 సంవత్సరంలో దాత ఈ భూమిని దానం గా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 1000 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించిన వ్యక్తుల నుంచి రికవరీ చేసి బాధితులకు అందించామని గుర్తుచేస్తూ,మిగిలిన భూభాగం కూడా ఎవరి బాపాతం కాదన్నారు. దాత ధర్మాన్ని కాపాడాలన్నారు. భూమి వ్యవహారాలపై జరుగుతున్న అనుమానాస్పద చర్యలను అధికారులే పెనుభూతిగా మారుస్తున్నారని చెప్పారు.కాకినాడలో అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు పూర్తి వివరాలతో నివేదించామని వెల్లడించారు. ఆనంద నిలయం ఆస్తుల రక్షణ కోసం త్వరలోనే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, హాస్టల్ అధికారులు,ఆర్‌ఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

కాకినాడ, కాకినాడ జిల్లా, పున్నమి ప్రతినిధి:
పిఠాపురం మహారాజా చిన్నారుల విద్య–వికాసం కోసం అప్పగించిన దాతాస్పద ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘాటుగా హెచ్చరించారు. ఆనంద నిలయం పరిధిలోని 19 ఎకరాల భూమిని ఆక్రమించేందుకుచోటుచేసుకుంటున్న కుట్రలు దాత ఆశయానికే తూట్లు పొడుస్తున్నాయని ఆయన తీవ్రఆగ్రహంవ్యక్తంచేశారు.ఆదివారం ఆనందనిలయం ప్రాంగాణంలో ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు వెయ్యి కోట్లు విలువ చేసే ఈ భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డి దోవలో పాగా వేయడానికి పన్నాగం పన్నెరని తెలిపారు. వారి ఆటలు ఇక సాగవని.ఎవరు కొనడానికి ముందుకొస్తే వారు ఇబ్బందుల్లో పడతారని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే చిన్నారుల గూడు అయిన ఆనంద నిలయాన్ని కాకావికాలం చేసిందని ఆయన మండిపడ్డారు.1910 సంవత్సరంలో దాత ఈ భూమిని దానం గా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 1000 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించిన వ్యక్తుల నుంచి రికవరీ చేసి బాధితులకు అందించామని గుర్తుచేస్తూ,మిగిలిన భూభాగం కూడా ఎవరి బాపాతం కాదన్నారు. దాత ధర్మాన్ని కాపాడాలన్నారు. భూమి వ్యవహారాలపై జరుగుతున్న అనుమానాస్పద చర్యలను అధికారులే పెనుభూతిగా మారుస్తున్నారని చెప్పారు.కాకినాడలో అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు పూర్తి వివరాలతో నివేదించామని వెల్లడించారు. ఆనంద నిలయం ఆస్తుల రక్షణ కోసం త్వరలోనే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, హాస్టల్ అధికారులు,ఆర్‌ఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.