Sunday, 7 December 2025
  • Home  
  • దాతృత్వానికి మారుపేరు కందుల*
- విశాఖపట్నం

దాతృత్వానికి మారుపేరు కందుల*

*దాతృత్వానికి మారుపేరు కందుల* *అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు* *పదివేల మందికి చీరలు దుప్పట్లు పంపిణీ* *విందు భోజనాలు.. పసందైన కానుకలు* *ఘనంగా సత్కరించిన పీలా వంశీకృష్ణ శ్రీనివాస్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* ప్రముఖ సంఘ సేవకులు ..జనసేన పార్టీ నాయకులు.. 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు దాతృత్వానికి మారుపేరుగా నిలిచారని జనసేన పార్టీ నాయకులు విశాఖ దక్షిణ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కొనియాడారు.. ఆదివారం కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు నేరెళ్ల కోనేరు జంక్షన్ లో ఉన్న ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకల్లో శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ నగర మేయర్ పీలా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నిరుపేదలకు నిరంతరం సేవ చేయాలనే మంచి సంకల్పంతో కందుల అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.. పేదలకు అండగా నిలవడంతో పాటు తన పరిధి మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయాలుగా నిలుస్తున్నారన్నారు.. నిరుపేదలకు నిత్యవసరాలు.. తోపుడు బండ్లు.. నవవధువులకు నూతన వస్త్రాలు మంగళ సూత్రాలు.. అలాగే వివిధ రకాల శుభకార్యాలకు పట్టుచీరలు దేవాలయాలకు వివిధ రకాల వెండి.. బంగారు వస్తువులు ఇలా లెక్కలేనన్ని సహాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కందుల నాగరాజు కే దక్కుతుందన్నారు. సేవలకు చిరునామాగా నిలిచిన డాక్టర్ కందుల .భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వీరు ఆకాంక్షించారు..32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తన పరిధి మేరకు విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.. కులాలకు.. మతాలకు అతీతంగా దక్షిణ నియోజకవర్గం పరిధిలో సాయం కోరేవారందరికీ ఏదో ఒకటి చేయాలనే మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా తన ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.. అలాగే తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ గా గెలిపించిన ప్రజల ఆకాంక్షల మేరకు తన వార్డు ను పూర్తిస్థాయిలో రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తున్నట్లు నాగరాజు చెప్పారు.. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని వాటిని కూడా పూర్తి చేసేందుకు సహకరించాలని అతిధులను కోరారు. *10,000 మందికి చీరలు..దుప్పట్లు పంపిణీ* కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఈ ఏడాది అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ప్రధానంగా 10000 మంది నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే తోపుడు బండ్లు అందజేశారు. అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కానుకలు అందజేశారు.. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ఈ పుట్టినరోజు వేడుకలకు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ..జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షత వహించగా కెఎన్ఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు కందుల బద్రీనాథ్ కేదార్నాథ్ పలువురు కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లు.వార్డ్ అధ్యక్షులు.. పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు.. అనేకమంది స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు పాల్గొని కందుల నాగరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కందుల దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు..

*దాతృత్వానికి మారుపేరు కందుల*

*అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు*

*పదివేల మందికి చీరలు దుప్పట్లు పంపిణీ*

*విందు భోజనాలు.. పసందైన కానుకలు*

*ఘనంగా సత్కరించిన పీలా వంశీకృష్ణ శ్రీనివాస్*

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-*
ప్రముఖ సంఘ సేవకులు ..జనసేన పార్టీ నాయకులు.. 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు దాతృత్వానికి మారుపేరుగా నిలిచారని జనసేన పార్టీ నాయకులు విశాఖ దక్షిణ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కొనియాడారు.. ఆదివారం కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు
నేరెళ్ల కోనేరు జంక్షన్ లో ఉన్న ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకల్లో శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ నగర మేయర్ పీలా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ
నిరుపేదలకు నిరంతరం సేవ చేయాలనే మంచి సంకల్పంతో కందుల అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.. పేదలకు అండగా నిలవడంతో పాటు తన పరిధి మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయాలుగా నిలుస్తున్నారన్నారు.. నిరుపేదలకు నిత్యవసరాలు.. తోపుడు బండ్లు.. నవవధువులకు నూతన వస్త్రాలు
మంగళ సూత్రాలు.. అలాగే వివిధ రకాల శుభకార్యాలకు పట్టుచీరలు దేవాలయాలకు వివిధ రకాల వెండి.. బంగారు వస్తువులు ఇలా లెక్కలేనన్ని సహాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కందుల నాగరాజు కే దక్కుతుందన్నారు. సేవలకు చిరునామాగా నిలిచిన డాక్టర్ కందుల .భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వీరు ఆకాంక్షించారు..32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
తన పరిధి మేరకు విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.. కులాలకు.. మతాలకు అతీతంగా దక్షిణ నియోజకవర్గం పరిధిలో సాయం కోరేవారందరికీ ఏదో ఒకటి చేయాలనే మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా తన ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.. అలాగే తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ గా గెలిపించిన ప్రజల ఆకాంక్షల మేరకు తన వార్డు ను పూర్తిస్థాయిలో రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తున్నట్లు నాగరాజు చెప్పారు.. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని
వాటిని కూడా పూర్తి చేసేందుకు సహకరించాలని అతిధులను కోరారు.
*10,000 మందికి చీరలు..దుప్పట్లు పంపిణీ*

కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఈ ఏడాది అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ప్రధానంగా 10000 మంది నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే తోపుడు బండ్లు అందజేశారు. అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కానుకలు అందజేశారు.. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ఈ పుట్టినరోజు వేడుకలకు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ..జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షత వహించగా కెఎన్ఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు కందుల బద్రీనాథ్ కేదార్నాథ్ పలువురు కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లు.వార్డ్ అధ్యక్షులు.. పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు.. అనేకమంది స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు పాల్గొని కందుల నాగరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కందుల దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.