*దసరా – చెడి తాలింఖానా కమిటీలకు 70 వేల విరాళం*
_ పవన్ ఫాన్స్ అధ్యక్షుడు ప్రసాద్ వినూత్న ఆలోచన
అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) :
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం అభిమానుల్లో పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ క్రమంలో అమలాపురం పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు ఆర్డిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఓజి సినిమా తొలి టిక్కెట్ను వేలం పెట్టగా 60 వేల రూపాయలు పలికింది. దానికి అభిమాన సంఘం తరఫున ఆర్డీఎస్ ప్రసాద్ మరో 10 వేలు జతచేసి అమలాపురంలో వందల ఏళ్ళుగా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ, చెడితాలింఖానా యుద్ధకళను దసరా ఉత్సవాల్లో సాంప్రదాయ బద్ధంగా కొనసాగిస్తూ వస్తున్న ఏడు ఉత్సవ కమిటీలైనా చెడితాలింఖాన కొంకాపల్లి, శ్రీ అబ్బిరెడ్డి రామదాసు చెడితాలింఖాన మహిపాలవీధి, శ్రీ శేషశయన మైనర్స్ పార్టీ గండు వీధి, మైనర్స్ పార్టీ రవణం మల్లయ్య వీధి, శ్రీ మహిషాసుర మర్దిని యువజన సంఘం రవణం వీధి, శ్రీ విజయదుర్గ యువజన సంఘం నల్లా వీధి, చెడితాలింఖాన మైనర్స్ పార్టీ శ్రీరాంపురం వార్లకు 10 వేల రూపాయల చొప్పున విరాళంగా అందించారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషికి స్పూర్తిగా ఈరోజు ఈ 70 వేల రూపాయలను దసరా ఉత్సవ కమిటీలకు ఇస్తున్నట్టు ఆర్డిఎస్ ప్రసాద్ తెలిపారు. శ్రీరాంపురం ఉత్సవ కమిటీకి దశాబ్ధాల కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మికశాఖా మాత్యులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ “సమస్యలపై ప్రశ్నించడం, సాయం కోరిన వారికి చేయి అందించడం పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు అని, ఆ ఆశయాలను కొనసాగిస్తూ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు క్షేత్ర స్థాయిలో పనిచేయడం, ఇలా ఆర్డీఎస్ ప్రసాద్ నాయకత్వంలో సంప్రదాయానికి ప్రోత్సహంగా 70 వేలు తాలింఖానా కమిటీలకు అందచేయడం చాలా మంచి విషయం” అని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అధ్యక్షులు ఆర్డీఎస్ ప్రసాద్ తో తొలి టికెట్ దక్కించుకున్న గుర్రం కృష్ణతో పాటు మెగా అభిమాన సంఘాల నాయకులు నల్లా చిట్టిబాబు, యేడిద శ్రీను, నల్లా నాయుడు, కార్యదర్శి వుద్దిశ చిన్న, ట్రెజరర్ ముద్రగడ దొరబాబు, గుబ్బల శేఖర్, సంసాని రవి, మామిళ్ళపల్లి పండు మరియు అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.

దసరా – చెడి తాలింఖానా కమిటీలకు 70 వేల విరాళం _ పవన్ ఫాన్స్ అధ్యక్షుడు ప్రసాద్ వినూత్న ఆలోచన
*దసరా – చెడి తాలింఖానా కమిటీలకు 70 వేల విరాళం* _ పవన్ ఫాన్స్ అధ్యక్షుడు ప్రసాద్ వినూత్న ఆలోచన అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం అభిమానుల్లో పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ క్రమంలో అమలాపురం పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు ఆర్డిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఓజి సినిమా తొలి టిక్కెట్ను వేలం పెట్టగా 60 వేల రూపాయలు పలికింది. దానికి అభిమాన సంఘం తరఫున ఆర్డీఎస్ ప్రసాద్ మరో 10 వేలు జతచేసి అమలాపురంలో వందల ఏళ్ళుగా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ, చెడితాలింఖానా యుద్ధకళను దసరా ఉత్సవాల్లో సాంప్రదాయ బద్ధంగా కొనసాగిస్తూ వస్తున్న ఏడు ఉత్సవ కమిటీలైనా చెడితాలింఖాన కొంకాపల్లి, శ్రీ అబ్బిరెడ్డి రామదాసు చెడితాలింఖాన మహిపాలవీధి, శ్రీ శేషశయన మైనర్స్ పార్టీ గండు వీధి, మైనర్స్ పార్టీ రవణం మల్లయ్య వీధి, శ్రీ మహిషాసుర మర్దిని యువజన సంఘం రవణం వీధి, శ్రీ విజయదుర్గ యువజన సంఘం నల్లా వీధి, చెడితాలింఖాన మైనర్స్ పార్టీ శ్రీరాంపురం వార్లకు 10 వేల రూపాయల చొప్పున విరాళంగా అందించారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషికి స్పూర్తిగా ఈరోజు ఈ 70 వేల రూపాయలను దసరా ఉత్సవ కమిటీలకు ఇస్తున్నట్టు ఆర్డిఎస్ ప్రసాద్ తెలిపారు. శ్రీరాంపురం ఉత్సవ కమిటీకి దశాబ్ధాల కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మికశాఖా మాత్యులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ “సమస్యలపై ప్రశ్నించడం, సాయం కోరిన వారికి చేయి అందించడం పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు అని, ఆ ఆశయాలను కొనసాగిస్తూ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు క్షేత్ర స్థాయిలో పనిచేయడం, ఇలా ఆర్డీఎస్ ప్రసాద్ నాయకత్వంలో సంప్రదాయానికి ప్రోత్సహంగా 70 వేలు తాలింఖానా కమిటీలకు అందచేయడం చాలా మంచి విషయం” అని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అధ్యక్షులు ఆర్డీఎస్ ప్రసాద్ తో తొలి టికెట్ దక్కించుకున్న గుర్రం కృష్ణతో పాటు మెగా అభిమాన సంఘాల నాయకులు నల్లా చిట్టిబాబు, యేడిద శ్రీను, నల్లా నాయుడు, కార్యదర్శి వుద్దిశ చిన్న, ట్రెజరర్ ముద్రగడ దొరబాబు, గుబ్బల శేఖర్, సంసాని రవి, మామిళ్ళపల్లి పండు మరియు అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.

