దళిత సర్పంచ్ అవమానం – ఆదోని ఎమ్మెల్యే, గుడిసె కృష్ణమ్మపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: ఎమ్మార్పీఎస్ డిమాండ్
ఆదోనిలో దళిత సర్పంచ్ గుడిసె కృష్ణమ్మపై అవమానకరంగా వ్యవహరించిన ఘటనపై, ఎమ్మెల్యే పార్థసారధి గుట్టురట్టు కావాలని నవ్యాంధ్ర MRPS డివిజన్ అధ్యక్షుడు సుమాల చార్లెష్, పట్టణ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. జూన్ 16న ఢనాపురం గుడిలో జరిగిన పార్టీ మీటింగ్‌లో సర్పంచ్‌ను అవమానించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, పోలీసులు సుమోటోగా స్పందించాలని కోరారు. అధికారులు స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసురాజు, శిఖమణి, వీరేష్ పాల్గొన్నారు.