దళిత వాడల్లో ఇండ్ల స్థలాలు, స్మశాన వాటికల కేటాయింపులో జాప్యం చేస్తే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం చేపడతాం…
సిపిఐ నాయకులు
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 3 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ )
నేడు అనగా నవంబర్ 3 సోమవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వేకోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు మండల రెవెన్యూ తాసిల్దార్ కార్యాలయం ఎదుట మాధవరం పోడు అరుంధతి వాడ నివాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ధర్నా కార్యక్రమం చేపట్టి వినతి పత్రం ఇవ్వడం జరిగినది , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండు గోల మణి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో దళిత, గిరిజన కాలనీలకు స్మశాన వాటికలు ఉన్నచోట్ల భూ కబ్జాదారులు, పెత్తందారులు వాటిని ఆక్రమించి వ్యవసాయ భూములుగా మార్చుకొని దర్జాగా అనుభవిస్తున్నారని తక్షణమే భూ కబ్జాదారుల నుండి దళిత గిరిజన గ్రామాల లో ఉన్న స్మశానవాటికలను సర్వే చేసి దళిత గిరిజనులకు అప్పజెప్పాలన్నారు, దళితలు, గిరిజనులు ఇండ్ల స్థలాలు లేక ఒక కుటుంబంలో రెండు, మూడు ఫ్యామిలీలు ఒకే కుటుంబంలో జీవిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో 33 లక్షల ఇండ్లు కట్టించామని సంకల గుద్దుకొని సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఎక్కడ ఒక ఇంటిని కూడా పూర్తి చేయలేదని వారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై మండిపడ్డారు, ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బలపరిచిన తెలుగుదేశం పార్టీ కి చెందిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇండ్ల స్థలాలు లేని నిరుపేదల గోడు పట్టించుకోకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెత లాగా దున్నపోతు మీద వర్షం పడినట్లు మొద్దు నిద్రలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో మాధవరం పోడు అరుంధతి వాడ గ్రామ ప్రజలు రేణుక, సుబ్బమ్మ, రవణమ్మ, నారాయణమ్మ తో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


