అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 21 ( పున్నమి న్యూస్ ప్రతినిధి):
రైల్వే కోడూరు మండలం
భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ కోడూరు మండల కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టి, కార్యాలయాన్ని ముట్టడించి తాసిల్దార్ కు వినత పత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా అధ్యక్షులు పండుగోల మణి. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చింతలపూరి నాగమ్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా పండుగోల మణి, జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ కోడూరు మండలంలో మైసూర్ వారి పల్లి గ్రామపంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ 2085 లో 3 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మైసూర్ వారి పల్లి అరుంధతి వాడకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మినుగు యానాదమ్మ భర్త జయరామయ్య గత 15 సంవత్సరముల నుండి రెండు ఎకరాలు భూమి ఉండగా
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19.10.2025 తేదీన ఆదివారం. దీపావళి సెలవులు సమయంలో అదును చూసుకొని రాత్రి పూట రైల్వే కోడూరు కి సంబంధించి జనసేన పార్టీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో ఆయన అనుచరులు రాత్రికి రాత్రి, ముళ్ల కంచె తీసి దళితుల భూమి ఒక ఎకరా ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు పూర్తిగా మూడు ఎకరాల భూమిని కబ్జా చేశారని, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా దళితులు భూములు దళితులు ఇచ్చి. అక్కడ మిగిలిన భూమిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలైన వారికి ఇంటి స్థలాలకు కేటాయించాలని తాహసిల్దార్ ను కోరగా, అర్హత గలవారు దరఖాస్తు చేసుకుంటే, పేదవారికి ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి అదేవిధంగా దళితుల భూములను కబ్జా చేసిన వారి పైన వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కేసులు కడతామని తహసిల్దార్ కే అమర్నాథ్ హామీ ఇచ్చారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ నాయకులు వెంకటరమణ. కటారి గోపాల్ బాధితులు దాదాపు 50 మంది పాల్గొనడం జరిగినది

దళితుల భూములను ఆక్రమించిన వారి పైన తక్షణమే కేసులు పెట్టాలి…
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 21 ( పున్నమి న్యూస్ ప్రతినిధి): రైల్వే కోడూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ కోడూరు మండల కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టి, కార్యాలయాన్ని ముట్టడించి తాసిల్దార్ కు వినత పత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా అధ్యక్షులు పండుగోల మణి. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చింతలపూరి నాగమ్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా పండుగోల మణి, జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ కోడూరు మండలంలో మైసూర్ వారి పల్లి గ్రామపంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ 2085 లో 3 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మైసూర్ వారి పల్లి అరుంధతి వాడకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మినుగు యానాదమ్మ భర్త జయరామయ్య గత 15 సంవత్సరముల నుండి రెండు ఎకరాలు భూమి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19.10.2025 తేదీన ఆదివారం. దీపావళి సెలవులు సమయంలో అదును చూసుకొని రాత్రి పూట రైల్వే కోడూరు కి సంబంధించి జనసేన పార్టీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో ఆయన అనుచరులు రాత్రికి రాత్రి, ముళ్ల కంచె తీసి దళితుల భూమి ఒక ఎకరా ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు పూర్తిగా మూడు ఎకరాల భూమిని కబ్జా చేశారని, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా దళితులు భూములు దళితులు ఇచ్చి. అక్కడ మిగిలిన భూమిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలైన వారికి ఇంటి స్థలాలకు కేటాయించాలని తాహసిల్దార్ ను కోరగా, అర్హత గలవారు దరఖాస్తు చేసుకుంటే, పేదవారికి ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి అదేవిధంగా దళితుల భూములను కబ్జా చేసిన వారి పైన వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కేసులు కడతామని తహసిల్దార్ కే అమర్నాథ్ హామీ ఇచ్చారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ నాయకులు వెంకటరమణ. కటారి గోపాల్ బాధితులు దాదాపు 50 మంది పాల్గొనడం జరిగినది

