వర్ల దేవదాసు మాదిగ*
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడికి నిరసన గా పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాలు మేరకు నవంబర్ 17న “జరుగు చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సత్యవేడు నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి MRPS జిల్లా కో ఇంచార్జి, సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జి పునబాకు మునివేలు సభాధ్యక్షత వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా ఇన్చార్జ్ *వర్ల దేవదాసు మాదిగ* మాట్లాడుతూ గవాయ్ గారి మీద దాడి చేసిన కిషోర్ అడ్వకేట్ ను వెంటనే అరెస్ట్ చేయాలని,దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే లక్ష్యంకై, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడడం కోసం ఉద్యమం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సిసింద్రీ మాదిగ,
జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాజా మాదిగ,ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా కో ఇన్చార్జ్ *మంగళపూరి సురేష్ మాదిగ,* సత్యవేడు నియోజవర్గ, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


