*దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదగా రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ఆధ్వర్యంలో 40 లక్షల విలువైన వైద్య పరికరాలను కేజీహెచ్ కు అందజేత*
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
* *2 వెంటిలేటర్స్, 10 సిరంజి పంప్స్, 40 వీల్ చైర్స్, 100 కాట్స్, 5 రెస్పెటరీ హ్యూమిడిఫైర్స్ కేజీహెచ్ కు అందజేత*
రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ఆధ్వర్యంలో 40 లక్షల విలువైన వైద్య పరికరాలను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదగా కేజీహెచ్ కు అందజేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రోటరీ క్లబ్లో ఎంతోమంది ప్రముఖులు అనేక రకమైన సేవా కార్యక్రమంలో విరివిగా చేస్తున్నారని తెలియజేశారు. నియోజకవర్గం లో విద్యకు , వైద్య రంగం పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ సందర్భంగా ప్రముఖులకు నియోజకవర్గంలో పలు పాఠశాలలకు, కళాశాలలకు రోటరీ క్లబ్ వారు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. 2 వెంటిలేటర్స్, 10 సిరంజి పంప్స్, 40 వీల్ చైర్స్, 100 కాట్స్, 5 రెస్పెటరీ హ్యూమిడైఫైర్స్ అందజేశారు . కార్యక్రమంలో సూపర్డెంట్ వాణి గారు, రోటరీ క్లబ్ పెద్దలు శోభన్ ప్రకాష్ గారు , ప్రిన్సిపాల్ సంధ్యాదేవి గారు, పెద్దలు రాంప్రసాద్ గారు, నహదా గారు, కృష్ణ కుమార్ గారు తో పాటు జనసేన పార్టీ వార్డ్ అధ్యక్షురాలు శ్రీమతి యజ్ఞశ్రీ గారు కూటమి నేతలు జోగి రాజుగారు, మహిగారు, డిప్యూటీ సూపర్డెంట్ శ్రీమతి వాసవి లత గారు, సీఎంఆర్వో శ్రీహరి గారు, ఏవో గారు పలువిభాగాల అధిపతిలు, డాక్టర్లు పాల్గొన్నారు….


