*దక్షిణ నియోజకవర్గం 34 వార్డు లో మనోరమ థియేటర్ సాయిబాబా ఆలయం వద్ద జనవాణి (పబ్లిక్ గ్రీవెన్స్)కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
*ప్రజల నుంచి నేరుగా వినతలు స్వీకరించిన ఎమ్మెల్యే*
*జనవాణి కార్యక్రమానికి విచ్చేసిన 31, 34, 35 వార్డుల ప్రజలు*
*ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు*
*జనవాణి లో హాజరైన జోనల్ కమిషనర్ శ్రీ మల్లయ్య నాయుడు గారు, వివిధ విభాగాల అధిపతులు (HOD), పోలీస్ సిబ్బంది,జీవీఎంసీ సిబ్బంది, సచివాల సిబ్బంది*
*ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనవాణి కార్యక్రమం*
ఈరోజు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 34వ వార్డు మనోరమ థియేటర్, సాయిబాబా ఆలయం వద్దవద్ద జనవాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కూటమి వార్డు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు పలువురు నుంచి వినతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు అక్కడికక్కడే అధికారుల సమక్షంలో కొన్ని అర్జీలు పరిష్కారం కాగా పరిష్కారం కానీ అర్జీలను వెంటనే పరిష్కరించమని సంబంధిత అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు కష్టాలకు కన్నీళ్ళను మిగిల్చిందనీ తెలిపారు. ప్రజల వద్దకు తానే స్వయంగా వెళ్లి సమస్యలను పరిష్కరించడం ఎమ్మెల్యేగా ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. అదే విధంగా నియోజకవర్గంలో ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉన్న తమను సంప్రదించాలని తెలిపారు. నియోజకవర్గం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, కూటమి పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివ ప్రసాద్ రెడ్డి గారు, ఇతర కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, స్టేట్ డైరెక్టర్లు, కూటమి వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధిపతులు, కార్పొరేటర్ శ్రీ నాగరాజు గారు, జీవీఎంసీ సిబ్బంది, సచివాల సిబ్బంది , రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎలక్ట్రికల్ సిబ్బంది, కూటమి నేతలు పాల్గొన్నారు..


