*దక్షిణ నియోజకవర్గం జోన్ – 4 కార్యాలయం లో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ ప్రారంభోత్సవం*.
*డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, గౌరవ కలెక్టర్ హరేందర్ ప్రసాద్ గారు*
*ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికిన జిల్లా స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు*.
*కార్యాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*.
*విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- *
ఈరోజు డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు…..వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.
పంచాయతీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
అందులో భాగంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు
గత 5 సంవత్సరాల వైసిపి పాలనలో రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాలను సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే గారు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి జరగకుండా పారదర్శకంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ప్రథమ లక్ష్యం……ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో మొదట నిలబడాలనేదే ప్రధమ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం
శ్రీ శ్రీ శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సందర్శించారు. కార్యక్రమంలో స్థానిక భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారని తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలత్తకుండా క్యూ లైన్ భక్తులు ఆగకుండా వెళ్లే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు….


