సోమవారం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ వివిధ వార్డుల పరిధిలో పలు అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
31వ వార్డు – ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం
విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జైల్ రోడ్డులోని ఇంటర్ కళాశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ ప్లాంట్ ఏర్పాటులో సహకరించిన వేదాంత కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పౌష్టిక ఆహారం అందించేందుకు కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
విద్యార్థులతో మాట్లాడుతూ, వారి సమస్యలను తెలుసుకున్నారు. కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ రూప, టిడిపి సీనియర్ నాయకురాలు గాయత్రి, జనసేన నాయకులు రాజేష్, వార్డు ఇన్‌చార్జ్ డాక్టర్ మర్రిమేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
33వ వార్డు – 8వ రాష్ట్రీయ పోషణ మాసం ఉత్సవాలు
పోషణ మాసం సందర్భంగా కుమ్మరి వీధి సామాజిక భవనంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోషణ మాసం ప్రాముఖ్యత, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి అవగాహన కల్పించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషక పదార్థాలను పరిశీలించి, శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో సిడిపిఓ నీలిమ, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, స్థానిక నేతలు చక్రవర్తి, జీకే, వెంకటప్పారావు, మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
35వ వార్డు – దుర్గామాతా నవరాత్రి అన్నదాన కార్యక్రమం
దుర్గామాతా నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా వేలంపేటలో ఘనంగా అన్నదాన కార్యక్రమం జరిగింది.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అమ్మవారి దర్శనం అనంతరం అన్నప్రసాదం కౌంటర్‌ను ప్రారంభించి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.
కార్యక్రమంలో స్థానిక టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.
30వ వార్డు – శ్రీ శ్రీ శ్రీ మరిడిమాంబ జెండా పండుగ
శ్రీ శ్రీ శ్రీ మరిడిమాంబ మహోత్సవాల సందర్భంగా కోడిపందాల వీధిలో జెండా పండుగ ఘనంగా జరిగింది.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని, 70 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తులతో కలిసి పండుగలో పాల్గొనడం సంతోషంగా ఉందని, యువత పలు సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షురాలు యజ్ఞశ్రీ, 37వ వార్డు అధ్యక్షుడు రవి, భాను తదితరులు పాల్గొన్నారు.


