పున్నమి అక్టోబర్ 26 రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి వెల్లడించారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణ పనులపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే హైదరాబాద్లోని ఆర్ &బీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో ఇబ్రహీంపట్నం చెరువు కట్ట రూపు రేకలు మారుతాయని ఎమ్మెల్యే తెలిపారు. చెరువు కట్టపై జరిగే ప్రమాదాల నివారణకు అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.

త్వరలో ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి