నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
నల్గొండ జిల్లా త్రిపురారం లో ఉన్న తెలంగాణ గిరిజన బాలికల మినీ గురుకులాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. సెలవుల తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ వారి పేర్లు,వివరాలు,ఇష్టం ఉన్న సబ్జెక్టులు తదితర అంశాలను ముచ్చటించారు. బాగా చదువుకోవాలని విద్యార్థులకు చెప్పారు. విద్యార్థులు తరగతి గదిలో చదువుకోవడమే కాకుండా, అక్కడే నేలపై పడుకుంటున్నారని తెలుసుకొని తక్షణమే వంద పరుపులను నల్గొండ నుండి పంపిస్తానని కలెక్టర్ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు.


