చిట్వేల్ అక్టోబర్ 31 పున్నమి ప్రతినిధి
పోల్లోపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల ప్రధాన త్రాగునీటి పైప్‌లైన్ దెబ్బతినడంతో గ్రామ ప్రజలు కొద్ది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే సర్పంచ్ వెంకటసుబ్బమ్మ స్వయంగా రంగంలోకి దిగి పైప్‌లైన్ మరమ్మత్తు పనులను వేగవంతం చేయించారు.
పంచాయతీ సెక్రటరీ హరికృష్ణ పర్యవేక్షణలో సిబ్బంది సహకారంతో శుక్రవారం మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. దీంతో తాగునీటి సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరింది.ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ
గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాం. సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కారం కల్పిస్తాం అన్నారు.గ్రామస్తులు మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించినందుకు సర్పంచ్ సుబ్బమ్మ, సెక్రటరీ హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.


