ఆగష్టు 29 తెలుగు భాషా దినోత్సవం (తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి) సందర్భంగా రచించబడిన కవిత.
తెలుగు వెలుగుల వైభవం – కవిత కళాత్మక భవిత
రచన: డాక్టర్ బద్రి. పీర్ కుమార్
కందుకూరి విశిష్ట పురస్కార గ్రహీత
అర్థశాస్త్ర అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
గూడూరు,
తె – తెలుగు పలుకుల తెల్లదనం భావాలంకరణకు మూలధనం
లు – లుంబిని లో జన్మించి ధ్యానం ద్వారా పొందిన బుద్ధుని జ్ఞానం గ
గు – గురజాడ అడుగుజాడల్లో మన సాహిత్యం సుసంపన్నం
వె – వెలకట్టలేని అనుబంధ విలువల వరసల సరాగాలు
లు – లుకలుకలు వికవికలు పకపకలు తేనె చినుకుల సవ్వడలు
గు – గుణాత్మక దృశ్యాంశాలు మనో నేత్ర మార్గదర్శకాలు
ల – లయబద్ధంగా పదాక్షరాల ఉచ్చారణ పసిడి కాంతుల మధురిమలు.
వై – వైవిధ్యమైన భావ ప్రకంపనలు వ్యవహారిక విశ్లేషణలు
భ – భజన గీతాల బృంద విన్యాసాల చిందులే ఉత్సవాలు
వం – వందన చందనాల అభినందన వేదికలు సమాజ సౌభాగ్యాలు.
క – కమనీయం కవితాత్మ కథనంపై ప్రశంసలు
వి – విజయతలంపు పులకించిన స్వాగత గీతాలు
త – తరతరాల మానసోల్లాస చారిత్రక స్మృతులు.
క – కళలు కలల కళాకారుల ఆత్మీయ సిరులు
ళా – అలాంటివి మానసిక వికాసానికి ఆసనాలు
త్మ- తమ ఇష్టాఇష్టాల విశ్లేషణ రూపాలు
క – కవుల కావ్య దీపాల అపురూప కనువిందులు
భ – భగవంతున్ని ప్రసన్నం చేసుకునే శక్తి కొలది
వి – విధాతరాతను మార్చుకునే నేర్పు కలది
త – తన్మయత్వమే ప్రయత్నంగా సాగే ప్రవాహమిది.
ఈ కవిత కుటుంబ పునాదులకు పటుత్వాన్నిచ్చే ఆప్యాయత
ఇదే తెలుగు వెలుగుల వైభవోత్సవం
శ్రోత సంతృప్త హృదయలయల సంభవం.


