తెలుగు బిగ్ బాస్ షోను తక్షణం నిలిపివేయాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ షో కొనసాగుతోందని, కుటుంబ విలువలు, సంస్కృతి పూర్తిగా దెబ్బతింటోందని ఫిర్యాదుదారులు తెలిపారు. ప్రత్యేకంగా కంటెస్టెంట్లుగా ఎంపిక చేసిన దివ్వెల మాధురి, రీతు చౌదరి లాంటి వారిని తీసుకోవడం ద్వారా యువతకు తప్పు సందేశం ఇస్తున్నారని ఆక్షేపించారు.
కర్ణాటకలో బిగ్ బాస్ షోను నిలిపివేసినట్టే, ఇక్కడ కూడా నిషేధం విధించకపోతే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి బిగ్ బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
షో నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదులో కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బిగ్ బాస్ షో భవితవ్యంపై ఆసక్తి నెలకొంది.

తెలుగు బిగ్ బాస్‌పై కలకలం – పోలీసులకు ఫిర్యాదు!
తెలుగు బిగ్ బాస్ షోను తక్షణం నిలిపివేయాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ షో కొనసాగుతోందని, కుటుంబ విలువలు, సంస్కృతి పూర్తిగా దెబ్బతింటోందని ఫిర్యాదుదారులు తెలిపారు. ప్రత్యేకంగా కంటెస్టెంట్లుగా ఎంపిక చేసిన దివ్వెల మాధురి, రీతు చౌదరి లాంటి వారిని తీసుకోవడం ద్వారా యువతకు తప్పు సందేశం ఇస్తున్నారని ఆక్షేపించారు. కర్ణాటకలో బిగ్ బాస్ షోను నిలిపివేసినట్టే, ఇక్కడ కూడా నిషేధం విధించకపోతే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి బిగ్ బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. షో నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదులో కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బిగ్ బాస్ షో భవితవ్యంపై ఆసక్తి నెలకొంది.

