Monday, 8 December 2025
  • Home  
  • తెలుగు తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
- ఖమ్మం

తెలుగు తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

పున్నమి Daily న్యూస్ ప్రతినిధి: T.రవీందర్ ఖమ్మం మొఘలుల ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్* మొఘలుల ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం, గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీఅసశాలి, ఔరంగజేబు కే ముచ్చెమటలు పట్టించిన వీరుడు, పేదల పాలిట పెన్నిధి, సమ సమాజ స్థాపకుడు, సమ సమాజ స్థాపనకు ప్రాణాలనే అర్పించిన యోధుడు, చత్రపతి శివాజీ మహారాజ్ కి సమకాలికుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు బోయనపల్లి సురేష్ గౌడ్ అన్నారు. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1650 లో పూర్వపు వరంగల్ జిల్లాలో జన్మించిన పాపన్న గౌడ్ తన కులవృత్తిని చేసుకుంటూ మొఘల్ రాజులు చేస్తున్న ఆకృత్యాలను, దారుణాలను సహించలేక సామాన్య ప్రజలనే యుద్ధ వీరులుగా, గెరిల్లా దళంగా తయారు చేసి మొగల్ రాజులపై తిరుగుబాటు చేసి ఎన్నో కోటలను స్వాధీన పరుచుకున్న యోధుడు అని తెలిపారు. దానిలో భాగంగానే గోల్కొండ కోటపై తన జెండాను ఎగురవేసి తన రాజ్య కాలంలో బడుగు, బహుజనుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారనీ కొనియాడారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని కులవృత్తులను ఐక్యం చేసి ముందుకు కదిలిన వీరుడు అని అన్నారు. పాపన్న గౌడ్ గురించి కేం బ్రిడ్జి ప్రెస్ బుక్ లో ప్రత్యేకంగా ప్రస్తావన చేసారని, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం లండన్ లోని “విక్టోరియా అండ్ ఆల్బర్ట్” మ్యూజియంలో సర్ధార్ పాపన్న మహారాజ్ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాంటి మహానుభావుని యొక్క 375 వ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నామనీ, ఈ జయంతి సందర్భంగా ప్రపంచ తెలుగు ప్రజలందరికీ వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించే విధంగా కార్యాచరణ చేసుకొని బడుగు, బలహీన వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

పున్నమి Daily న్యూస్
ప్రతినిధి: T.రవీందర్
ఖమ్మం

మొఘలుల ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి
తెలుగు తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్*
మొఘలుల ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం, గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీఅసశాలి, ఔరంగజేబు కే ముచ్చెమటలు పట్టించిన వీరుడు, పేదల పాలిట పెన్నిధి, సమ సమాజ స్థాపకుడు, సమ సమాజ స్థాపనకు ప్రాణాలనే అర్పించిన యోధుడు, చత్రపతి శివాజీ మహారాజ్ కి సమకాలికుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు బోయనపల్లి సురేష్ గౌడ్ అన్నారు. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1650 లో పూర్వపు వరంగల్ జిల్లాలో జన్మించిన పాపన్న గౌడ్ తన కులవృత్తిని చేసుకుంటూ మొఘల్ రాజులు చేస్తున్న ఆకృత్యాలను, దారుణాలను సహించలేక సామాన్య ప్రజలనే యుద్ధ వీరులుగా, గెరిల్లా దళంగా తయారు చేసి మొగల్ రాజులపై తిరుగుబాటు చేసి ఎన్నో కోటలను స్వాధీన పరుచుకున్న యోధుడు అని తెలిపారు. దానిలో భాగంగానే గోల్కొండ కోటపై తన జెండాను ఎగురవేసి తన రాజ్య కాలంలో బడుగు, బహుజనుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారనీ కొనియాడారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని కులవృత్తులను ఐక్యం చేసి ముందుకు కదిలిన వీరుడు అని అన్నారు. పాపన్న గౌడ్ గురించి కేం బ్రిడ్జి ప్రెస్ బుక్ లో ప్రత్యేకంగా ప్రస్తావన చేసారని, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం లండన్ లోని “విక్టోరియా అండ్ ఆల్బర్ట్” మ్యూజియంలో సర్ధార్ పాపన్న మహారాజ్ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాంటి మహానుభావుని యొక్క 375 వ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నామనీ, ఈ జయంతి సందర్భంగా ప్రపంచ తెలుగు ప్రజలందరికీ వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించే విధంగా కార్యాచరణ చేసుకొని బడుగు, బలహీన వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.