ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కొమ్మి లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ చేసి నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.



