సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పెరుమాళ్ళ పాడు గ్రామానికి చెందిన పలసాని ఈశ్వర్ రెడ్డి మంగళవారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరినాయుడు సహకారంతో తెలుగుదేశం పార్టీలో చేరారు.తెలుగుదేశం పార్టీలోకి పలసాని ఈశ్వర్ రెడ్డిని మంత్రి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు.టిడిపి పార్టీలో చేరిన వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసానివ్వడం జరిగినది.అలాగే పలసాని ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.అలాగే ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి చేస్తున్నటువంటి నిరంతర కృషికి ఆయన పనితీరు నచ్చి పార్టీలో చేరడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.


