అలంపూర్ : అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుండడంతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సరిహద్దు చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎస్సై కిరణ్ కుమార్ మరియు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టి వస్తువుల తరలింపు పై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నారు. అలాగే వాహనదారులకు ఎన్నికల కమిషన్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు 50 వేల రూపాయలకు పైబడి తమ వెంట తీసుకుని వెళ్లరాదు. అధిక మొత్తంలో డబ్బులు తమ వెంట తీసుకుని వెళుతున్నట్లయితే సంబంధిత పత్రాలు ఉంచుకోవాలి. ఓటర్లలను ప్రలోభ పెట్టే సరైన ధృవ పత్రాలు లేని నగదు మద్యం వస్తువులను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్సె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంతో తనిఖీలు చేస్తున్నారు.

తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు.
అలంపూర్ : అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుండడంతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సరిహద్దు చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎస్సై కిరణ్ కుమార్ మరియు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టి వస్తువుల తరలింపు పై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నారు. అలాగే వాహనదారులకు ఎన్నికల కమిషన్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు 50 వేల రూపాయలకు పైబడి తమ వెంట తీసుకుని వెళ్లరాదు. అధిక మొత్తంలో డబ్బులు తమ వెంట తీసుకుని వెళుతున్నట్లయితే సంబంధిత పత్రాలు ఉంచుకోవాలి. ఓటర్లలను ప్రలోభ పెట్టే సరైన ధృవ పత్రాలు లేని నగదు మద్యం వస్తువులను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్సె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంతో తనిఖీలు చేస్తున్నారు.

