పున్నమి ప్రతినిధి
ఖమ్మం
దీపావళి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “చీకటిని తొలగించే దీపం, వెలుగులు పూయించే సమయం, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమైన దీపావళి పండుగ మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, అష్టైశ్వర్యాలు నింపాలని” ఆయన ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పండుగగా దీపావళి గుర్తుండిపోవాలని మంత్రి పేర్కొన్నారు.


