టీఆర్పి అభ్యర్థులను గెలిపించండి:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న
—————————————
జనగామ, ఫిబ్రవరి 08,పున్నమి న్యూస్:
ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకులను,అభివృద్ధికి పాటు పడే విద్యావంతులను ఎన్నుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న తెలిపారు. జనగామ పట్టణం మున్సిపాలిటీ 5,10,13,23 వార్డులలో విస్తృతంగా ప్రచారం చేశారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి 5వ వార్డు లో పో పోటిచేస్తున్న రేణుకుంట్ల మురళి బైండ్ల కు మద్దతుగా ప్రజల వద్దకు వెళ్ళి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఇప్పటివరకు కాంగ్రెస్, బిఆర్ఎస్,బిజెపి పార్టీ లకు అనేక సార్లు అవకాశం ఇచ్చారని అయినప్పటికీ మున్సిపాలిటీ లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే మిగిలి పోయాయని అన్నారు. ఈ ఒక్కసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయితే రాజకీయాలు మారడంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని స్పష్టం చేశారు.ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి,వారి అభివృద్ధి కై నిరంతరం
పనిచేసే నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులని మల్లన్న తెలిపారు.మున్సిపాలిటీలను
అభివృద్ధి చేసి చూపించే బాధ్యత
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిలదేనని అందుకు ప్రజలు తమ ఓటు కత్తెర గుర్తు పై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.జనగామ మున్సిపల్ కౌన్సిల్ లో డ్రెయినేజీ,రోడ్లు,వీధి దీపాలు,తాగునీరు ఏర్పాటు కు గట్టి పోరాటం చేస్తామని అన్నారు.ప్రచారంలో మల్లన్న తో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా ,మండల,పట్టణ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులనే గెలిపించండి:తీన్మార్ మల్లన్న
టీఆర్పి అభ్యర్థులను గెలిపించండి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ————————————— జనగామ, ఫిబ్రవరి 08,పున్నమి న్యూస్: ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకులను,అభివృద్ధికి పాటు పడే విద్యావంతులను ఎన్నుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న తెలిపారు. జనగామ పట్టణం మున్సిపాలిటీ 5,10,13,23 వార్డులలో విస్తృతంగా ప్రచారం చేశారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి 5వ వార్డు లో పో పోటిచేస్తున్న రేణుకుంట్ల మురళి బైండ్ల కు మద్దతుగా ప్రజల వద్దకు వెళ్ళి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఇప్పటివరకు కాంగ్రెస్, బిఆర్ఎస్,బిజెపి పార్టీ లకు అనేక సార్లు అవకాశం ఇచ్చారని అయినప్పటికీ మున్సిపాలిటీ లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే మిగిలి పోయాయని అన్నారు. ఈ ఒక్కసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయితే రాజకీయాలు మారడంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని స్పష్టం చేశారు.ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి,వారి అభివృద్ధి కై నిరంతరం పనిచేసే నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులని మల్లన్న తెలిపారు.మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిలదేనని అందుకు ప్రజలు తమ ఓటు కత్తెర గుర్తు పై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.జనగామ మున్సిపల్ కౌన్సిల్ లో డ్రెయినేజీ,రోడ్లు,వీధి దీపాలు,తాగునీరు ఏర్పాటు కు గట్టి పోరాటం చేస్తామని అన్నారు.ప్రచారంలో మల్లన్న తో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా ,మండల,పట్టణ నాయకులు పాల్గొన్నారు.

