*తెలంగాణ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్
ఖమ్మం పున్నమి అక్టోబర్ 31
మాజీ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 12:15 గంటలకు ఆయన తో రాజభవన్లో తెలంగాణ గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తోపాటు ఇతర మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
అయితే అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించ డంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఇది ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.
దీనికి సంబంధించి అధికారులు గురువారం నాడే అన్ని ఏర్పాట్లు చేశారు. రాజ్ భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్, తదితర అంశాలపై అధికారులు ఏర్పాట్లు చేశారు.

