పున్నమి ప్రతి నిధి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ని తాజా గా అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీ మీద పలువురు సీనియర్ లు అసంతృప్తి లో ఉన్నారు. కేవలం హైదరాబాద్ లో సెటిల్ అయినా జానకర్షణ లేని వ్యక్తులకి రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడం మంచిది కాదని అంటున్నారు. MP, లు MLA లు చెప్పిన పదవులు ఇవ్వక పోవడం వెనుక రామ చంద ర్ రావు మార్క్ స్పష్టం గా కనిపిస్తుంది. కేవలం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో నే 10 మందికి రాష్ట్ర కార్యవర్గం లో చోటు కల్పించడం, వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకి ప్రాధాన్యత ఇవ్వక పోవడం పట్ల కొందరు గురరుగా ఉన్నట్లుగా సమాచారం. ఈ కమిటీ తో రాబోయే ఏ ఒక్క ఎన్నికలకి వెళ్లిన పరాభావం ఖాయం అని అంటున్నారు మార్పులు చేర్పులు సంప్రదింపులు చేసుకొని బీజేపీ చీఫ్ రామ చంద్రరావు మరో నూతన కమిటీ ని ప్రకటించాలిసిన ఆవశ్యకత ఉందని వేశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


