నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు.
ప్రజా పాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం ఆమె జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా ఈనెల 17న ఉదయం 10 గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు,
సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని అనంతరం మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని తెలిపారు. ఆయా శాఖల అధికారులు వారి శాఖల ప్రగతికి సంబంధించిన వివరాలను తక్షణమే సిపిఓ కు పంపించాలని చెప్పారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు,
సిటింగ్, వేడుకలకు, ప్రముఖులను ఆహ్వానించడం, ఇన్విటేషన్ కార్డ్స్, తదితర అన్ని పనులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే ప్రారంభించాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందున మంగళవారం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.జిల్లా
అధికారులందరూ వారి సిబ్బందితో సహా వేడుకలకు హాజరు కావాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులు విద్యార్థులను వేడుకలకు తీసుకురావాలని చెప్పారు.

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం ఆమె జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా ఈనెల 17న ఉదయం 10 గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని అనంతరం మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని తెలిపారు. ఆయా శాఖల అధికారులు వారి శాఖల ప్రగతికి సంబంధించిన వివరాలను తక్షణమే సిపిఓ కు పంపించాలని చెప్పారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, సిటింగ్, వేడుకలకు, ప్రముఖులను ఆహ్వానించడం, ఇన్విటేషన్ కార్డ్స్, తదితర అన్ని పనులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే ప్రారంభించాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందున మంగళవారం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.జిల్లా అధికారులందరూ వారి సిబ్బందితో సహా వేడుకలకు హాజరు కావాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులు విద్యార్థులను వేడుకలకు తీసుకురావాలని చెప్పారు.

