Wednesday, 11 February 2026
  • Home  
  • తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన దీరవనిత చాకలి ఐలమ్మ అన్న :జిల్లా కలెక్టర్
- తెలంగాణ

తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన దీరవనిత చాకలి ఐలమ్మ అన్న :జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) వీరనారి చాకలి ఐలమ్మ 130 వ జయంతిని పురస్కరించుకుని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.నల్గొండ జిల్లా కేంద్రంలో నాగార్జునసాగర్ రోడ్ లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించాలని,ఆనాటి దేశముఖలపై తిరుగుబాటు చేసి భూ పోరాటానికి నాంది పలికారని, తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో ఉందని,రాష్ట్ర ప్రభుత్వం చాకిలి ఐలమ్మ జయంతిని, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
వీరనారి చాకలి ఐలమ్మ 130 వ జయంతిని పురస్కరించుకుని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.నల్గొండ జిల్లా కేంద్రంలో నాగార్జునసాగర్ రోడ్ లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించాలని,ఆనాటి దేశముఖలపై తిరుగుబాటు చేసి భూ పోరాటానికి నాంది పలికారని, తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో ఉందని,రాష్ట్ర ప్రభుత్వం చాకిలి ఐలమ్మ జయంతిని, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.