ఖమ్మం పున్నమి ప్రతి నిధి
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌లుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావ్ మరియు తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ కపిలవాయి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకులు, క్రీడాభిమానులు, జర్నలిస్టులు వీరిని అభినందించారు. క్రీడాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఇద్దరు నాయకులు తెలిపారు. తెలంగాణ క్రికెట్ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికైనందుకు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.


