Monday, 8 December 2025
  • Home  
  • తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
- తెలంగాణ

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తీసుకున్న ముఖ్య నిర్ణయాలను మీడియాకు మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. 👉🏽ప్రజాకవి అందెశ్రీకి కేబినెట్ నివాళి తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ గారి మరణం రాష్ట్రానికి తీరని లోటుగా కేబినెట్ పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించింది. కేబినెట్ నిర్ణయాలు: అందెశ్రీ గారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు పాఠ్యపుస్తకాల మొదటి పేజీలో “జయజయహే” రాష్ట్ర గీతం ముద్రణ 👉🏽 రిజర్వేషన్ల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్రం సహకరించనందున, హైకోర్టు ఆదేశాల ప్రకారం: 50% రిజర్వేషన్ పరిమితిలో స్థానిక సంస్థల ఎన్నికలు 15వ ఫైనాన్స్ కమీషన్ నిధుల దృష్ట్యా ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 👉🏽తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లు ఆమోదం సుమారు 4 లక్షల గిగ్ వర్కర్లు రక్షణ & భరోసా పొందేలా రూపొందించిన గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 👉🏽 SRSP ఫేజ్–2 కు దామోదర్ రెడ్డి పేరు SRSP ఫేజ్–2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును కేబినెట్ ఖరారు చేసింది. 👉🏽 ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల సందర్బంగా గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫోర్త్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయం. ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు డిసెంబర్ 9న తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల 👉🏽సౌదీ ప్రమాదంలో తెలంగాణ వాసుల మృతి – సంతాపం & సాయం సౌదీలో జరిగిన ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు: ₹5 లక్షల ఆర్థిక సాయం తక్షణమే ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపడం కుటుంబ సభ్యుల కోరిక మేరకు అక్కడే అంత్యక్రియలకీ ప్రభుత్వం సహాయం. చేస్తుంది అని మంత్రి పొంగులేటి శ్రీనువాసు రెడ్డి తెలియజేసారు.

పువ్వాడ నాగేంద్ర కుమార్

(పున్నమి తెలంగాణ ప్రతి నిధి)
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తీసుకున్న ముఖ్య నిర్ణయాలను మీడియాకు మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

👉🏽ప్రజాకవి అందెశ్రీకి కేబినెట్ నివాళి

తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ గారి మరణం రాష్ట్రానికి తీరని లోటుగా కేబినెట్ పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించింది.
కేబినెట్ నిర్ణయాలు:

అందెశ్రీ గారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు

పాఠ్యపుస్తకాల మొదటి పేజీలో “జయజయహే” రాష్ట్ర గీతం ముద్రణ

👉🏽 రిజర్వేషన్ల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు

బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్రం సహకరించనందున, హైకోర్టు ఆదేశాల ప్రకారం:

50% రిజర్వేషన్ పరిమితిలో స్థానిక సంస్థల ఎన్నికలు

15వ ఫైనాన్స్ కమీషన్ నిధుల దృష్ట్యా ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు

👉🏽తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లు ఆమోదం

సుమారు 4 లక్షల గిగ్ వర్కర్లు రక్షణ & భరోసా పొందేలా రూపొందించిన గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

👉🏽 SRSP ఫేజ్–2 కు దామోదర్ రెడ్డి పేరు

SRSP ఫేజ్–2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును కేబినెట్ ఖరారు చేసింది.

👉🏽 ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల సందర్బంగా గ్లోబల్ సమ్మిట్

డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫోర్త్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయం.

ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు

డిసెంబర్ 9న తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల

👉🏽సౌదీ ప్రమాదంలో తెలంగాణ వాసుల మృతి – సంతాపం & సాయం

సౌదీలో జరిగిన ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు:

₹5 లక్షల ఆర్థిక సాయం

తక్షణమే ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపడం

కుటుంబ సభ్యుల కోరిక మేరకు అక్కడే అంత్యక్రియలకీ ప్రభుత్వం సహాయం. చేస్తుంది అని మంత్రి పొంగులేటి శ్రీనువాసు రెడ్డి తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.