పున్నమి ప్రతినిధి
ఖమ్మం.
ఖమ్మం జిల్లా పరిధిలోని మధిర నియోజకవర్గం లో గల ముదిగొండ మండలంలోని బీఆర్ఎస్ నాయకత్వం,కార్యకర్తలు మొత్తంగా భారీ ఎత్తున తెలంగాణ ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అందరికీ కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు వెల్లువెత్తుతున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యంగా అమలు చేస్తుందన్నారు
గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 7.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి వ్యవస్థలను ధ్వంసం చేశారు.ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదు . కేంద్రాన్ని పలుమార్లు కలిసి వడ్డీ భారాన్ని తగ్గించాం, 11.5% వడ్డీని 8%కు తగ్గించి రాష్ట్రానికి ఊరట కలిగించమన్నారు
ఉద్యోగుల బకాయిలను నెలకు 700 కోట్ల చొప్పున చెల్లిస్తున్నాం, గత పది సంవత్సరాలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది, రహదారులు, పాఠశాలలు, ఇళ్లు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు
కృష్ణా నదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినవే.గోదావరి పై లక్ష కోట్లు అప్పు తెచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం రాష్ట్ర దురదృష్టం. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టుకు ప్రజా ప్రభుత్వం మళ్లీ జీవం పోస్తోందన్నారు
రాష్ట్ర ఆర్థిక స్థితి కఠినమైనప్పటికీ, యావత్ క్యాబినెట్ రోజుకు 18 గంటల పాటు కృషి చేస్తోంది, ప్రజా ఓటు విలువను రాష్ట్ర ప్రగతికి వినియోగిస్తున్నామన్నారు
మూడు నెలల్లోనే 21 వేల కోట్ల రైతు రుణమాఫీ, తొమ్మిది రోజుల్లోనే 9 వేల కోట్ల రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రజా ప్రభుత్వ ప్రత్యేకత . 5 లక్షలతో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు మద్దతు ధరతో పాటు 500 బోనస్, 29 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్, 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
56 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, మరో 30 వేల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మహిళా సంఘాలకు 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాం, ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు
ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అని అన్నారు


