*తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది.
పున్నమి మార్చి6/2026
(ప్రతినిధి ఖమ్మం)
ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని ఆదేశించింది. ట్యాక్స్ వసూలు చేసే బాధ్యత డీఈవోలకు అప్పగించింది..!!*
ట్యాక్స్ వసూలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. *ట్యాక్స్ వసూలులో నిర్లక్ష్యంగా ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటామని* తెలిపింది..ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. *ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ.. శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వేగవంతం చేశారు.* రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 వేల ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత మూడేండ్ల ఆదాయ, వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. *ప్రతి రెండేండ్లకోసారి 8 శాతం మాత్రమే ఫీజు పెంచుకునేలా ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.* దీనికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు ముమ్మరమైంది. *ఎంఈఓలు, డీఈఓల ఆధారంగా ఏ స్కూళ్లో ఎంత ఫీజు ఉంది? ఏఏ క్లాసులకు ఎంతెంత తీసుకుంటున్నారు?* అనే వివరాలను సేకరిస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో దేని ఆధారంగా బేస్ ఫీజులను నిర్ణయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేశారు.
*త్వరలో పబ్లిక్ లోకి ఫీజుల డ్రాఫ్ట్*
ఫీజుల డ్రాఫ్ట్ ను పారదర్శకంగా వెబ్సైట్లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పేరెంట్స్, స్టూడెంట్లు, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలను, సూచనలు సేకరించనున్నారు. ఆ తర్వాతే దాన్ని ఫైనల్ చేయాలని సర్కారు డిసైడ్ అయింది. డీఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుల వివరాలనూ ఏ స్కూల్ ఎంత వసూలు చేయబోతోందనే డేటాను వెబ్ సైట్ టో పెట్టనున్నారు.
Ok

