Thursday, 5 February 2026
  • Home  
  • తూర్పుపల్లి జాతీయ ఉపాధి హామీలో అవకతవకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తూర్పుపల్లి జాతీయ ఉపాధి హామీలో అవకతవకలు

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) మండలంలోని తూర్పుపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లే వారి కంటే పనికి రాని వారి పేర్లు రాసుకుంటూ ఎక్కడో ఉన్న వారి పేర్లు రాస్తూ అధిక లాభార్జన చేస్తున్నాడని సీనియర్ మేట్ లోకేష్ పై ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం సంబంధిత ఏపీవో ని కలిసి ఉపాధి హామీ పనులలో తీవ్ర జాప్యం జరుగుతుందని, దీనిని పరిశీలించి విచారణ చేసి అతనిపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మేము పనికి వెళితే మాకు తక్కువ వేతనం వేస్తున్నారని పనికి రాని వాళ్ల పేర్లకు ఎక్కువ రాసుకుంటూ వారికి ఎక్కువ వేతనం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని సోమవారం చేజర్ల గ్రీవెన్స్ లో అర్జీ ఇవ్వడం జరిగినది.అనంతరం స్థానిక ఎంపీడీవో తో కలిసి వినతి పత్రం అందజేస్తూ తూర్పుపల్లిలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనితీరును క్లుప్తంగా వివరించడం జరిగినది.అలాగే మాకు 8 వారాలకు పనికి వెళితే మూడు వారాలు మాత్రమే మాకు కూలీలు పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో పనికి రానివారు పేర్లు ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఇదేమిటని సీనియర్ మేట్ ని అడిగితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ మమ్మల్ని దూషిస్తున్నాడని, నానా బూతులు తిడుతున్నాడని వారు విన్నవించారు.ఎంపీడీవో సానుకూలంగా స్పందించి వీటన్నిటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)

మండలంలోని తూర్పుపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లే వారి కంటే పనికి రాని వారి పేర్లు రాసుకుంటూ ఎక్కడో ఉన్న వారి పేర్లు రాస్తూ అధిక లాభార్జన చేస్తున్నాడని సీనియర్ మేట్ లోకేష్ పై ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం సంబంధిత ఏపీవో ని కలిసి ఉపాధి హామీ పనులలో తీవ్ర జాప్యం జరుగుతుందని, దీనిని పరిశీలించి విచారణ చేసి అతనిపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మేము పనికి వెళితే మాకు తక్కువ వేతనం వేస్తున్నారని పనికి రాని వాళ్ల పేర్లకు ఎక్కువ రాసుకుంటూ వారికి ఎక్కువ వేతనం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని సోమవారం చేజర్ల గ్రీవెన్స్ లో అర్జీ ఇవ్వడం జరిగినది.అనంతరం స్థానిక ఎంపీడీవో తో కలిసి వినతి పత్రం అందజేస్తూ తూర్పుపల్లిలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనితీరును క్లుప్తంగా వివరించడం జరిగినది.అలాగే మాకు 8 వారాలకు పనికి వెళితే మూడు వారాలు మాత్రమే మాకు కూలీలు పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో పనికి రానివారు పేర్లు ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఇదేమిటని సీనియర్ మేట్ ని అడిగితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ మమ్మల్ని దూషిస్తున్నాడని, నానా బూతులు తిడుతున్నాడని వారు విన్నవించారు.ఎంపీడీవో సానుకూలంగా స్పందించి వీటన్నిటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.