తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ మండలం I పంగిడి గ్రామంలోని జెడ్పీ హై స్కూల్‌లో “మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 3.0” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ….విద్య అనేది కేవలం పరీక్షల పరిమితి కాదని, విలువలు, శిస్థాచారం, సమాజం పట్ల బాధ్యతను నేర్పేది కూడా విద్యేనని వివరించారు. తల్లిదండ్రులు పిల్లల కలలు సాకారం చేయాలంటే ఆ పిల్లల ప్రతిభను నిరంతరం గమనిస్తూ స్ఫూర్తినివ్వాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా చిన్నచిన్న లోపాలను గుర్తించి, వెంటనే దిద్దితేనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించగలరని చెప్పారు.
చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునే వాతావరణం ఏర్పడాలని వివరించారు. వ్యక్తిత్వ వికాసం, మానసిక బలం, నైతిక విలువలు పెరుగడానికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు కలిసి పిల్లలకు సహకరించాలని సూచించారు.
విద్యార్థుల అబిలిటీలను, ఆసక్తులను గుర్తించి, వారితో సన్నిహిత అనుసంధానం కొరకు ఈ మెగా పీటీఎం 3.0 కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
END


