పున్నమి: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెంట్ మండలం: ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చెరువులో మునిగి రిటైర్డ్ పంచాయతీ రాజ్ డిఇ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్ నగర్ కు చెందిన రిటైర్డ్ డిఇ పాదూరి రమేష్ (61) మద్యపానానికి బానిసై, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చాడు. ఆయన భార్య పాదూరి రోహిణి (51) ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో రమేష్ “మన్నెగూడలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్తున్నాను” అంటూ ఇంటి నుంచి బయల్దేరి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో, బుధవారం సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉండగా, బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుర్కయంజాల్ మసాబ్ చెరువు వద్ద బుద్ధ విగ్రహం సమీపంలో ఒక గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. పోలీసులు రోహిణి కుటుంబానికి సమాచారం ఇవ్వగా, ఆమె చెప్పుల ద్వారా ఆ మృతదేహాన్ని తన భర్త రమేష్గు గా ర్తించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, రమేష్ చెరువులో పడి మునిగిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. “భర్త మరణంపై నాకు ఎలాంటి అనుమానం లేదు” అని రోహిణి తెలిపారు.

తుర్కయంజాల్ చెరువులో రిటైర్డ్ పంచాయతీ రాజ్ డిఈ మృతి